ప్రియుడు మోసగించాడని..

tribal young woman commit to suicide - Sakshi

గిరిజన యువతి ఆత్మహత్య

రాజవొమ్మంగి (రంపచోడవరం): ప్రియుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని మనస్తాపానికి గురైన ఓ గిరిజన యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. జడ్డంగి పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ మరణించింది. స్థానిక ఎస్సై వెంకటనాగార్జున కథనం ప్రకారం.. మండలంలోని దోనెలపాలెం గ్రామానికి చెందిన కేదారి శివనాగకుమారి (22) బుధవారం రాత్రి ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి అపస్మారక స్థితికి చేరింది. ఆమెను వెంటనే కుటుంబీకులు జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే ఆమె
మరణించిందన్నారు.

పెళ్లికి నిరాకరించడంతో..
శివనాగకుమారి పక్కగ్రామమైన జడ్డంగిలోని వట్టూరి మల్లికార్జునరావు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లికి నిరాకరిస్తున్నాడు. దీంతో పాటు అతడికి మరొకరితో పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసి కుమారి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

మల్లికార్జునరావుపై ఎస్సీ, ఎస్టీ కేసు
యువతిని ప్రేమించానని మోసగించి, ఆమె మరణానికి కారణమైన మల్లికార్జునరావుపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
చేశామని ఎస్సై తెలిపారు.

Back to Top