సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య | Software Employee Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Jan 7 2019 10:42 AM | Updated on Jan 7 2019 10:42 AM

Software Employee Commits Suicide in Hyderabad - Sakshi

మౌనిక (ఫైల్‌)

మలక్‌పేట: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సలీంనగర్‌ ఆఫ్జల్‌నగర్‌లో ఉంటున్న సిల్వర్‌ మణి కుమార్తె మౌనిక (33) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెకు 2007లో అభిషేకం అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఆర్యన్‌ (10) కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత 18 నెలలుగా వారు వేరుగా ఉంటున్నారు. కాగా  ఆదివారం మౌనిక తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటాన్ని గుర్తించిన  కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి సిల్వర్‌మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement