క్లాస్‌రూంలోకి కారు దూసుకెళ్లడంతో.. | school kids died in car crashes into class room | Sakshi
Sakshi News home page

క్లాస్‌రూంలోకి కారు దూసుకెళ్లడంతో..

Nov 7 2017 2:39 PM | Updated on Nov 7 2017 2:44 PM

school kids died in car crashes into class room - Sakshi

సిడ్నీ: అదుపుతప్పిన ఓ కారు క్లాస్‌రూంలోకి దూసుకెళ్లగా ఇద్దరు చిన్నారులు చనిపోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆస్ట్రేలియాలోని గ్రీన్‌కేర్‌ పట్టణ శివారులో చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ కారు స్థానిక బన్‌స్కియా రోడ్‌ పబ్లిక్‌ స్కూలులోకి మంగళవారం ఉదయం దూసుకొచ్చింది.  క్లాస్‌రూం గోడల్ని ఢీకొట్టి లోనికి వెళ్లిన కారు విద్యార్థులపై బీభత్సం సృష్టించింది.

దీంతో ఇద్దరు బాలురు(8) అక్కడికక్కడే చనిపోగా, ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. బాధిత విద్యార్తులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాదానికి కారణమైన మహిళ(52)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఉద్దేశపూర్వకంగా ఈ పనికి పాల్పడి ఉంటుందని తాము భావించటం లేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement