
సిడ్నీ : నిజంగా ఆమె మృత్యువును దాటిందని చెప్పాలి.. రెప్పపాటు కాలంలో పోలీసులు స్పందింకపోయి ఉంటే.. ఆమె శవం కూడా దొరికి ఉండేది కాదు. ఈ ఘటన సిడ్నీలో జరిగింది. సిడ్నీలో సముద్ర తీర ప్రాంతంలో ఒక మహిళ.. తన హ్యాచ్‌బ్యాక్ కారులోనే విశ్రమిస్తోంది. ఆమెకు మత్తమందు అలవాటు కూడా ఉంది. డ్రగ్స్ తీసుకుని అలాగే కార్లో పడుకుండిపోయింది. ఇదే సమయంలో హ్యాండ్‌బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో కార్ నెమ్మదిగా.. నీళ్లలోకి ప్రయాణించింది.
కార్ సముద్రంవైపు నెమ్మదిగా ప్రయాణించింది.. అంతలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు దీనిని గమనించారు. ఒక సీనియర్ పోలీస్ వేగంగా స్పందించింది.. నీళ్లలో ఈదుకుంటా కార్ దగ్గరకు వెళ్లారు. ఎంత ప్రయత్నించినా కార్ డోర్ తెరుచుకోకపోవడంతో.. చేతిలోని ఆయుధంతో అద్దాలను పగులగొట్టారు. ఈలోగా అక్కడకు చేరిన మరికొందరు అధికారులు ఆమెను.. కార్లోంచి సురక్షితంగా బయటకు తీశారు. అతంలోనే కార్ సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. ఆశ్చర్యం కలిగిన ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీస్‌ల కృషిని మెచ్చుకుంటూ.. నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

