ఘాట్‌రోడ్డులో ప్రమాదం: ఐదుగురు మృతి

road accident - Sakshi

మారేడుమిల్లి: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం  జరిగింది. టాటా వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో రఘు అనే వ్యక్తి మృతిచెందాడు. రాణి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పోలీసు బృందాలను సంఘటనా స్థలానికి పంపి సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆయన ఆదేశించారు.


 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top