ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు

Police Speeding Up Investigation Of Molestation Case - Sakshi

మైనర్‌పై లైంగిక దాడి కేసులో ఎన్నో మలుపులు

నిందితురాలు సుమలత అరెస్టు... 15 రోజుల రిమాండ్‌

కాల్‌ డేటాతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి..

పలువురు బాలికలను ట్రాప్‌ చేసినట్లుగా భావిస్తున్న పోలీసులు

ఆత్మహత్యకు పాల్పడిన భర్త మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

తీగ లాగితే డొంకంతా కదులుతోంది. విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు చూసి పోలీసులకే దిమ్మ తిరుగుతోంది. ఒంగోలులో పెంట్‌ హౌస్‌ నుంచి దూకిన ఘటన వెనుక అతడి భార్య పాత్ర విస్తు గొలుపుతోంది. భార్య చేసిన సిగ్గుమాలిన పని పోలీసులకు తెలియడం అవమానంగా భావించిన భర్త ఆత్మహత్యకు పాల్పడగా ఆ కేసు దర్యాప్తులో తవ్వే కొద్దీ ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆడ పుట్టుక పుట్టి మగాడిలా బాలికలకు రాసిన ప్రేమ లేఖలు.. కృత్రిమ పరికరాలు, అసహజ లైంగిక కార్యకలాపాలు.. ఇలా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సత్‌ సంప్రదాయమైన కట్టూ బొట్టుతో కనిపించే మహిళలో ఎవరికీ తెలియని ఇలాంటి కోణం మరొకటి ఉందంటే నమ్మశక్యం కాదు. మైనర్‌పై లైంగిక దాడి కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు నిందితురాలి కాల్‌డేటా పరిశీలించడంతో సుమలత గుట్టు రట్టవుతోంది.

సాక్షి, ఒంగోలు: సంతనూతలపాడు మండలం ఎనికెపాడుకు చెందిన గోనుగుంట ఏడుకొండలు కొండపిలో ఆర్‌ఎంపీగా ప్రాక్రీసు చేస్తుండేవాడు. అదే సమయంలో కొండపి మండలానికి చెందిన సుమలత కుట్టు మిషన్‌ నేర్చుకునేందుకు వెళ్తుండేది. ఈ క్రమంలో ఏడుకొండలు, సుమలతకు పరిచయమయ్యాడు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారైనప్పటికీ అప్పటికే రెండు పెళ్లిళ్లయిన సుమలతను ఒక వివాహమైన ఏడుకొండలుకు జత కుదిరింది. ఏడేళ్ల కిందట ఓ మధ్య వర్తి సాయంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరు ఒంగోలు మారుతీ నగర్‌కు మకాం మార్చారు. ఇప్పటికీ వీరికి పిల్లలు మాత్రం కలగలేదు. ఇదిలా ఉండగా ఈనెల 4వ తేదీన తనకు మత్తు ఇచ్చి కొందరు లైంగిక దాడి చేశారంటూ 17 ఏళ్ల బాలిక స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అందులో ఏడుకొండలు, సుమలత పేర్లను కూడా చేర్చింది. దీనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమకు అందిన సమాచారం మేరకు బుధవారం ఏడుకొండలు ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ బ్యాగులో కృత్రిమ జననాంగాలను పోలిన వస్తువులు కనిపించాయి. అది తెలిసి, తన భార్య వల్లే ఇదంతా.. అంటూ అవమాన భారంతో ఏడుకొండలు పెంట్‌ హౌస్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఏడుకొండలు ఇంట్లో సోదాలు చేస్తున్న తాలూకా సీఐ లక్ష్మణ్‌ తదితరులు 

పడతుల మధ్య ప్రేమ లేఖలు..
ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురువారం నిందితురాలి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మగరాయుడిలా కనిపించేందుకు సుమలత ధరించే దుస్తులు, లైంగిక చర్యకు ఉపయోగించే కృత్రిమ పరికరం, నడుముకు చుట్టుకునే బెల్టు వంటి వాటిని సీజ్‌ చేశారు. కొన్ని ప్రేమలేఖలు బయటపడ్డాయి. అవి సుమలతే మగవారు రాసినట్టుగా బాలికలకు రాసినవిగా భావిస్తున్నారు. సుమలత దంపతులు మైనర్లను ట్రాప్‌చేసి, వ్యభిచార రాకెట్‌ నడుపుతున్నారేమో అని పోలీసులు  అనుమానించారు. కృత్రిమ పరికరం బయటపడడంతో ఇదేదో అసహజ లైంగిక చర్యగా భావించి విచారణ చేపట్టారు. తమకు ఫిర్యాదు ఇచ్చిన మైనర్‌ను ట్రాప్‌ చేసి మగ వేషంలో లైంగిక దాడికి పాల్పడింది కూడా సుమలతగానే నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె వినియోగించిన సెల్‌ఫోన్‌ సిమ్‌కార్డుల ఆధారంగా కాల్‌ డేటాపై దృష్టి సారించారు. ఆ కాల్‌ డేటాలో ఆమె అనేక మంది మైనర్లను ట్రాప్‌ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో నిందితురాలు ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలికి ఇంకెవరైనా సహకరించారా అని కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఇంకెన్ని అంశాలు వెలుగుచూస్తాయో అనే ఉత్కంఠ  నెలకొంది. 

నిందితురాలికి 15 రోజుల రిమాండ్‌..
బాలికపై అసహజ రీతిలో లైంగిక దాడికి పాల్పడిందనే ఫిర్యాదుపై జరుగుమల్లి పోలీసులు సుమలతను అరెస్టు చేసి గురువారం కందుకూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించగా ఆమెను ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు. భార్య చేసి సిగ్గుమాలిన పని పోలీసులకు తెలియడం అవమానంగా భావించిన ఆమె భర్త మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. ఈ కేసులో తాలూకా పోలీసులు ఏడుకొండలు మృతదేహానికి స్థానిక ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లి లక్ష్మమ్మకు అప్పగించారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు నిందితురాలి ఇంట్లో కొన్ని ప్రేమలేఖలు గుర్తించారు. అవి ఆమె బాధితురాలైన బాలికకు రాసినవిగా భావిస్తున్నారు. నిందితురాలిని 24 గంటల్లో అరెస్టు చేయాల్సి రావడం, భర్త ఆత్మహత్యకు పాల్పడడం వంటి కారణాలతో దాదాపు 15 మంది పోలీసులు ఈ విచారణలో పాల్గొని అనేక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఆమె కాల్‌డేటాపై దృష్టి పెట్టిన పోలీసులకు నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమె అనేక మంది మైనర్లను ట్రాప్‌ చేసినట్లుగా గుర్తించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top