
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, ఆయన తనయుడు శివ(పాత చిత్రం)
విజయవాడ: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావుతో పాటు ఆయన కుమారుడిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు సంవత్సరాల క్రితం మరణించిన సాయిశ్రీ చావుకు బోండా ఉమాహేశ్వర రావు, ఆయన కుమారుడు శివ కారణమని సాయిశ్రీ తల్లి సుమన శ్రీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని విజయవాడ పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో బోండా ఉమ, ఆయన కుమారుడు శివపై కేసు నమోదు చేశారు. ఇటీవలే బాధితురాలు సుమనశ్రీ విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కూడా కలిశారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు.