హాజీపూర్‌లో పద్నాలుగేళ్ల బాలిక దారుణ హత్య

Nine Years Old Girl Was Murdered Brutally In Yadadri Bhuvanagiri District - Sakshi

బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావణి(14) అనే బాలికను దారుణంగా హత్య చేసి స్కూలు సమీపంలో ఉన్న ఓ బావిలో పడేశారు. వివరాలు.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న శ్రావణి నిన్న స్కూల్లో స్పెషల్‌ క్లాస్‌ ఉందంటూ బయటకు వెళ్లింది. ఇంటి నుంచి వెళ్లిన శ్రావణి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువుల ఇళ్లల్లో వెతికినా లాభం లేకపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు.

బావి దగ్గర లభించిన శ్రావణి బ్యాగు ఆధారంగా బావిలో శ్రావణి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సకాలంలో బాలిక మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని గ్రామస్తులు నిలదీశారు. ఎవరు హత్య చేసి ఉంటారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top