భూతగాదాలో తమ్ముడి హత్య | Murder In Land Issue Nalgonda | Sakshi
Sakshi News home page

భూతగాదాలో తమ్ముడి హత్య

May 20 2018 7:34 AM | Updated on Jul 30 2018 8:41 PM

Murder In Land Issue Nalgonda - Sakshi

హత్యకు గురైన సత్తయ్య

లింగాలఘణపురం : మండలంలోని మాణిక్యాపురంలో అన్నదమ్ముల భూమి తగాదాలో తమ్ముడు బడికె సత్తయ్య (65) హత్యకు గురైన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్సై వేణుగోపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మాణిక్యాపురంలో బడికె బుచ్చి ఎల్లయ్య, బడికె సత్తయ్య అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా భూమి పంచాయతీ సాగుతుంది. శుక్రవారం బుచ్చిఎల్లయ్య ట్రాక్టర్‌ తీసుకొని వివాదాస్పదంగా ఉన్న భూమిలో దున్నేందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న సత్తయ్య అక్కడకు వెళ్లి ట్రాక్టర్‌ను అడ్డుకున్నాడు.

ఈ సమయంలో అన్నదమ్ములు బుచ్చిఎల్లయ్య, సత్తయ్యల మధ్య వివాదం జరిగి ఘర్షణకు దిగారు. దీంతో సత్తయ్య కిందపడి స్త్పహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు సత్తయ్యను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బడికె మల్లేశ్, బడికె చంద్రయ్య, బడికె బుచ్చిఎల్లయ్య, పరశురాములు, చౌదరిపల్లి కరుణాకర్, రాగం నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వేణుగోపాల్‌ తెలిపారు. కాగా, మాణిక్యాపురంలో సత్తయ్య అంత్యక్రియల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement