ఆ వ్యాపారిని పట్టిస్తే రూ. లక్ష బహుమతి

MP Government Announced Rs 1 Lakh Reward For Jeetu Soni Capture - Sakshi

భోపాల్‌: హనీ ట్రాప్‌ కేసులో ప్రధాన నిందితుడిగా పరారీ ఉన్న ఓ వ్యాపారవేత్తను పట్టుకునెందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన రివార్డ్‌ మనీని రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచారు. మానవ అక్రమ రవాణా, దోపిడి కేసులలో నిందితుడిగా ఉన్న ఈ వ్యాపారవేత్త పేరు జితేంద్ర సోని. ఆయన ఇండోర్‌లో సంజ్హ లోక్‌స్వామి అనే సాయంకాల వార్తా పత్రిక  ప్రచురణ కర్తగా వ్యవహిస్తున్నాడు.  ఇది ఆయన బయటకు కనిపించే వృత్తి మాత్రమే. అయితే డ్యాన్స్‌ బార్‌లను నడపడం, హోటల్స్‌ నడిపిస్తూ.. మహిళలను అక్రమంగా రవాణా చేయడం, దోపిడిలు చేయడం, బడా వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఇతగాడి ప్రవృత్తిగా మార్చుకున్నాడు. జీతుపై ఆయుధ కేసుతో పాటు మొత్తం 43 కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులలో జీతు కుమారుడు అమిత్‌తో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హనీ ట్రాప్‌ కేసులలో జీతు సోనితో పాటు గత బీజేపీ ప్రభుత్వంలోని మంత్రి, పదవి విరమరణ పొందిన సెక్రటరి ప్రిన్సిపాల్‌తో మరో బడా వ్యక్తులు కూడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జీతు ఆస్తులను స్వాధీనం చేసి ఆయన ఆక్రమ కట్టడాలైన హోటల్‌, కేఫ్‌లను  ధ్వంసం చేశారు.

అదే విధంగా ఈ హనీ ట్రాప్‌ కేసులో అయిదుగురు మహిళలతో పాటు ఓ వ్యక్తిని పోలీసులు సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. వీరు ఇండోర్‌ సివిల్‌ ఇంజనీర్‌ ఆశ్లీల వీడియోలు తీసి వాటితో ఆయనను బెదిరించి రూ. 3 కోట్లు డిమాండ్‌ చేసిన కేసులో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠాపై ఇదివరకే మధ్యప్రదేశ్‌లోని రాజకీయ నాయకులను, బ్యూరోక్రాట్స్‌ను ట్రాప్‌ చేసిన ఆరోపణలు ఉన్నట్లు పోలీసుల పేర్కొన్నారు. ఈ హనీ ట్రాప్‌ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టగా, ప్రస్తుతం ఈ కేసును మధ్యప్రదేశ్‌ హైకోర్టు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top