ఇద్దరు పిల్లలతో సహా గృహిణి అదృశ్యం

Mother Missing With Two Children In Hyderabad - Sakshi

పహాడీషరీఫ్‌: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీకాంత రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుక్కుగూడ గ్రామానికి చెందిన జమాల్‌పూర్‌ జహంగీర్, సరితా బాయి(28) దంపతులకు అక్షయ (9), ఓంకార్‌ (6) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 4న బయటికి వెళ్లిన జహంగీర్‌ సాయంత్రం తిరిగివచ్చే సరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇరుగు పొరుగు వారిని ఆరా తీయగా తమకు తెలియదన్నారు. దీంతో అతను వారి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top