మాట్లాడే పని ఉంది రమ్మని చెప్పి...

Money Thieves  In Warangal Railway Gate - Sakshi

రైల్వేగేట్‌ (వరంగల్‌): మాట్లాడే పని ఉందంటూ రమ్మని చెప్పి.. ఆతర్వాత బెదిరించి ఓ బంగారం షాపు గుమస్తా బ్యాగ్‌లోని రూ.14.38లక్షల నగదును దుండగులు అపహరించిన సంఘటన నగరంలోని వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు, వరంగల్‌ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం కథనం ప్రకారం... వరంగల్‌ ఆర్‌ఎన్‌టీ రోడ్‌లోని శ్రీకృష్ణా బులియన్‌ మర్చంట్స్‌ షాపులో గుమస్తాగా పనిచేస్తున్న బేతి యుగేందర్‌ చెన్నైలో బంగారం నగలు కొనుగోలు చేసేందుకు శుక్రవారం రాత్రి 9గంటలకు వరంగల్‌ స్టేషన్‌కు వచ్చాడు.తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో రైలు ఎక్కాడు.

గుర్తుతెలియని వ్యక్తి(30) వచ్చి ‘నీతో మా ట్లాడేది ఉంది.. సార్‌ పిలుస్తుండు.. స్టేషన్‌కు వెళ్లాలి.. రా...’ అన్నా డు. నిజమే అనుకుని అతడు రైలు దిగడంతో గుర్తుతెలియని ఆ వ్యక్తి బెదిరించాడు. మరో ఇద్దరు వచ్చి యుగేందర్‌ బ్యాగ్‌లోని రూ. 14,38,800 నగదు అపహరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. షాపు ఓనర్‌ సురేష్‌కుమార్‌ దాలియాకు సమాచారం ఇచ్చా డు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా కనిపించారు. దీంతో పోలీసులు ఆ ముఠా కోసం గాలిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణా బులియన్‌ మర్చం ట్స్‌ దుకాణం యజమాని సురేష్‌కుమార్‌ దాలి యా వరంగల్‌ జీఆర్పీలో ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top