వివాహిత ఆత్మహత్య | Married Woman Commits Suicide in Visakhapatnam | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Dec 5 2018 12:22 PM | Updated on Jan 3 2019 12:14 PM

Married Woman Commits Suicide in Visakhapatnam - Sakshi

కీర్తి పద్మావతి మృతదేహం

పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్‌ఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన పిళ్లా కీర్తి పద్మావతి(19)ని బక్కన్నపాలెం ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన మహేష్‌కు ఇచ్చి సుమారు 7 నెలల కిందట వివాహం చేశారు. ఆమె కడుపు నొప్పి, నడుము నొప్పితో దీర్ఘకాలంగా బాధ పడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో వారందరూ దిగువ పోర్షన్‌లోని గదులలో నిద్రపోతుండగా పై అంతస్తులో నిర్మించిన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement