మైనర్‌ బాలికకు ముద్దు.. ఐదేళ్ల జైలు | Man Gets 5 Years Imprisonment For Kissing Minor Girl In Mumbai | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికకు ముద్దు.. ఐదేళ్ల జైలు

Jun 25 2020 2:46 PM | Updated on Jun 25 2020 2:54 PM

Man Gets 5 Years Imprisonment For Kissing Minor Girl In Mumbai - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : మైనర్‌ బాలికను ముద్దు పెట్టుకున్న కేసులో ఓ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రముంబైకి చెందిన అబు అబ్దుల్‌ రెహ్మాన్‌ అనే 30 ఏళ్ల వ్యక్తి 2018 జూన్‌ 29న అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అతడ్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌  తరలించారు. (అమ్మాయితో ఇంత రాత్రి పూట ఎక్కడికి?..)

బుధవారం ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును ముంబై స్థానిక కోర్టు వెలువరించింది. మైనర్‌ బాలిక తనను ముద్దు పెట్టుకుంది అతనే అంటూ కోర్టులో అబ్దుల్‌ను‌ గుర్తు పట్టింది. దీంతో అతడ్ని దోషిగా తేల్చిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాలిక కుటుంబానికి ఐదు వేల రూపాయల పరిహారం అందించాలని తీర్పునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement