వరుసకు చెల్లెలు అయిన మహిళ ఫొటోను.. | Man Arrest in Cyber Crime in Guntur | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఫేస్‌బుక్‌ నిందితుడి అరెస్ట్‌

Jan 26 2019 1:55 PM | Updated on Jan 26 2019 1:55 PM

Man Arrest in Cyber Crime in Guntur - Sakshi

గుంటూరు, పిడుగురాళ్లటౌన్‌: పట్టణానికి చెందిన తాడేపల్లి సందీప్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ వీరేంద్రబాబు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ పట్టణానికి చెందిన తాడేపల్లి సందీప్‌కుమార్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి తన తండ్రితో పాటు వ్యాపారం చేస్తున్నాడు. 2017 డిసెంబర్‌ నెలలో ఓ ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఏర్పాటు చేసుకుని అప్పటినుంచి పట్టణంలోని వరుసకు చెల్లెలు అయిన ఓ మహిళ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసి ఆమెకు అసభ్యకరమైన సందేశాలను పంపిస్తున్నాడు. ఈ క్రమంలో మహిళ, ఆమె భర్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌డీపీఓ ఆదేశాల మేరకు సీఐ వీరేంద్రబాబు, ఎస్‌ఐ టీపీ  నారాయణస్వామి, సిబ్బంది శాస్త్రీయ పరిశోధన ద్వారా కేసును దర్యాప్తు చేసి పూర్తి ఆధారాలతో గురువారం పిడుగురాళ్ల బస్టాండ్‌లో సందీప్‌ను అరెస్ట్‌చేశారు. నిందితుడిని శుక్రవారం కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement