భూ వివాదంలో ఐదుగురి దారుణ హత్య

Madhya Pradesh Family Murdered By Relatives In Land Dispute  - Sakshi

మధ్యప్రదేశ్‌లో ఘటన

భోపాల్‌ : రెండు కుటుంబాల మధ్య  జరిగిన భూమి వివాదంలో ఐదుగురు హత్య చేయబడిన ఘటన శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో జరిగింది. హత్యకు గురైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని.. అందులో ఓ బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మనోజ్‌ ఆహీర్వార్, సంజీవ్‌ ఆహిర్యార్‌ ఇద్దరు అన్నదమ్ముళ్లు. వారి కుటుంబం భోపాల్‌ నగరానికి ఈశాన్య ప్రాంతంలోని బినాటౌన్‌లో నివసిస్తున్నారు. వారి బంధువైన మనోహర్‌ ఆహీర్వార్ ఇంటిలో నిర్మాణ పనులు జరుగుతుండటంతో తన మామ అయిన మనోజ్‌ను రహదారి కోసం రెండు అడుగుల భూమి అడగగా అతను నిరాకరించడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం మొదలైనట్లు పోలీస్‌ అధికారి మౌర్య వెల్లడించారు.

వారి మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరడంతో మనోహర్‌ అతని ఇద్దరి కుమారులు ప్రవీణ్, ప్రశాంత్‌లతో కలిసి మనోజ్‌ కుటుంబంపై దాడి చేశాడు. ఈ దాడిలో మనోజ్, సంజీవ్, అతని భార్య రాజకుమారి (30) వారి కుమారుడు యశ్వంత్‌ (12) అక్కడికక్కడే చనిపోగా సంజీవ్‌ మేనత్త తారాబాయ్‌ సాగర్‌ హస్పిటల్‌లో చికిత్స పోందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారకులైన ప్రశాంత్, ప్రవీణ్‌ పరారిలో ఉండగా మనోహర్‌  ఆహీర్వార్‌ను అదుపులోకి తీసుకోని అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top