పగలు భిక్షాటన.. రాత్రి దొంగతనం

Machilipatnam Police Arrest Woman Beggar When Thefting - Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా : పగలు భిక్షాటన చేస్తూ రెక్కీ నిర్వహించి.. రాత్రిపూట దొంగతనాలకు పాల్పడుతున్న కి‘లేడి’ దొంగ ఆట కట్టించారు మచిలీపట్నం పోలీసులు. వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పసుపేలేటి లలిత గత కొన్నాళ్లుగా మచిలీపట్నంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో పగటి పూట భిక్షాటన ముసుగులో రెక్కీ నిర్వహించి.. రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడుతుండేది. ఈ క్రమంలో శనివారం పోలీసులకు చిక్కింది.

లలితను అదుపులోకి తీసుకున్న మచిలీపట్నం రూరల్‌ పోలీసులు ఆమె వద్ద నుంచి దాదాపు 19 తులాల బంగారం.. 86 తులాల వెండితో పాటు రూ. 5 లక్షల విలువచేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో లలితతో పాటు మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం లలిత మీద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు మచిలీపట్నం డీఎస్పీ మెహబూబా షా తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top