పురుగుల మందు తాగినీటి గుంటలో పడి.. | Love Couple Commits Suicide in Karnataka | Sakshi
Sakshi News home page

కోళ్లేగాలలో ప్రేమజంట ఆత్మహత్య

Jun 24 2019 1:06 PM | Updated on Jun 24 2019 1:06 PM

Love Couple Commits Suicide in Karnataka - Sakshi

ప్రేమ జంట కిరణ్, సంగీత (ఫైల్‌)

పెళ్లికి పెద్దలు ఒప్పుకోదని అఘాయిత్యం

కర్ణాటక, యశవంతపుర : ప్రేమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కోళ్లేగాల గ్రామాంతర పోలీసుస్టేషన్‌లో జరిగింది. తాలూకా ఉగని గ్రామానికి చెందిన కిరణ్‌ (23), సంగీతా(17)లు పురుగుల మందు తాగి సమీపంలో నీటి గుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలోని ఎస్‌వీకే కాలేజీలో పీయూసీ చదువుతున్న సంగీతను ఏడాది నుండి ప్రేమిస్తున్నాడు. ఈ విషయం రెండు వైపుల వారికి తెలుసు. ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయంపై కిరణ్‌ తన తండ్రి నాగరాజు వద్ద కూడా చర్చించారు. అయితే తనకు ఇష్టంలేదని తెల్చి చేప్పేశాడు. సంగీతకు పెళ్లి ఈడు లేకపోవటంతో నాగరాజు పెళ్లికి నిరాకరించారు. సంగీతతో పెళ్లి చేయకంటే తన శవం చూడాల్సి ఉంటుందని కిరణ్‌ తండ్రిని బెదిరించి ఇంటి నుండి వెళ్లి పోయాడు. ప్రేమికులద్దరూ కొళ్లేగాలకు వెళ్లి క్రిమినాశక మందును భోజనంలో కలుపకుని తిని సమీపంలోని గవివరదరాజస్వామి కొండకు వెళ్లారు. అక్కడ ఇద్దరు మృతి చెందారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

Advertisement
 
Advertisement
Advertisement