బాధితుని ఫిర్యాదుతో వెలుగు చూసిన వైనం

Kidney Racket Find At Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : సాగర నగరం కేంద్రంగా సాగుతోన్న భారీ కిడ్నీ రాకెట్‌ గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖలోని శ్రద్ధా ఆస్పత్రిలో ఈ కిడ్నీ రాకెట్‌ ఆగడాలు వెలుగు చూశాయి. ఆర్థిక అవసరాల్లో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్‌గా చేసుకుని గుట్టుగా ఈ దందాను సాగిస్తున్నారు. దళారుల చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాలు.. హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన పార్థసారధి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన దళారి మంజునాథ్‌ పార్థసారధిని కలిశాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసున్న మంజునాథ్‌ ఒక్క కిడ్నీ ఇస్తే.. రూ. 12 లక్షలు ఇస్తానని పార్థసారధిని నమ్మించాడు. ఇంత భారీ మొత్తం ఒక్కసారే చేతికందుతుండటంతో పార్థసారధి కూడా అందుకు అంగీకరించాడు. అయితే కిడ్నీ తీసుకున్న తర్వాత మంజునాథ్‌ కేవలం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. దాంతో పార్థసారధి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం కాస్తా వెలుగు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంజునాథ్‌ను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top