breaking news
kidny rocket
-
విశాఖలో వెలుగు చూసిన భారీ కిడ్నీ రాకెట్
-
విశాఖలో వెలుగు చూసిన భారీ కిడ్నీ రాకెట్
సాక్షి, విశాఖపట్నం : సాగర నగరం కేంద్రంగా సాగుతోన్న భారీ కిడ్నీ రాకెట్ గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖలోని శ్రద్ధా ఆస్పత్రిలో ఈ కిడ్నీ రాకెట్ ఆగడాలు వెలుగు చూశాయి. ఆర్థిక అవసరాల్లో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్‌గా చేసుకుని గుట్టుగా ఈ దందాను సాగిస్తున్నారు. దళారుల చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన పార్థసారధి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన దళారి మంజునాథ్ పార్థసారధిని కలిశాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసున్న మంజునాథ్ ఒక్క కిడ్నీ ఇస్తే.. రూ. 12 లక్షలు ఇస్తానని పార్థసారధిని నమ్మించాడు. ఇంత భారీ మొత్తం ఒక్కసారే చేతికందుతుండటంతో పార్థసారధి కూడా అందుకు అంగీకరించాడు. అయితే కిడ్నీ తీసుకున్న తర్వాత మంజునాథ్ కేవలం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. దాంతో పార్థసారధి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం కాస్తా వెలుగు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంజునాథ్‌ను అరెస్ట్ చేశారు. -
కిడ్నీరాకెట్లో ప్రధాన సూత్రధారుల అరెస్ట్
నల్గొండ క్రైం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీరాకెట్లో ప్రధాన సూత్రధారులైన గుజరాత్‌కు చెందిన సురేష్, ప్రజాపతితో పాటు మరో ఇద్దరిని నల్గొండ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ ముఠా దాదాపు వంద మందికి చెందిన కిడ్నీలను విక్రయించారని జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు. ఒక్కో కిడ్నీ రూ. 30 లక్షల చొప్పున ఇప్పటివరకు దాదాపు 60 కిడ్నీలు అమ్మారని తెలిపారు. దీంతో రూ. 3 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. శ్రీలంకలోని మూడు ప్రధాన ఆస్పత్రులకు కూడా కిడ్నీలను విక్రయించారని చెప్పారు. శ్రీలంకలోని కొలంబో నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ మాధవ, డాక్టర్ మౌనిక, డాక్టర్ సాధన, షేర్ హాస్పిటర్కు చెందిన డాక్టర్ జెన్నిఫర్, డాక్టర్ రోషిణి, ఐస్టోన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ హబీబా శెట్టిలపై కూడా కేసు నమోదు చేశామని, వారిని త్వరలో రెస్టు చేస్తామని ఎస్పీ వివరించారు.నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అదనపు సమాచారం కోసం విచారిస్తున్నారు.