రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీరాకెట్‌లో ప్రధాన సూత్రధారులైన గుజరాత్‌కు చెందిన సురేష్, ప్రజాపతితో పాటు మరో ఇద్దరిని నల్గొండ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు
కిడ్నీరాకెట్‌లో ప్రధాన సూత్రధారుల అరెస్ట్
Jan 19 2016 10:36 AM | Updated on Aug 29 2018 4:18 PM
నల్గొండ క్రైం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీరాకెట్‌లో ప్రధాన సూత్రధారులైన గుజరాత్‌కు చెందిన సురేష్, ప్రజాపతితో పాటు మరో ఇద్దరిని నల్గొండ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ ముఠా దాదాపు వంద మందికి చెందిన కిడ్నీలను విక్రయించారని జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు.
ఒక్కో కిడ్నీ రూ. 30 లక్షల చొప్పున ఇప్పటివరకు దాదాపు 60 కిడ్నీలు అమ్మారని తెలిపారు. దీంతో రూ. 3 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. శ్రీలంకలోని మూడు ప్రధాన ఆస్పత్రులకు కూడా కిడ్నీలను విక్రయించారని చెప్పారు. శ్రీలంకలోని కొలంబో నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ మాధవ, డాక్టర్ మౌనిక, డాక్టర్ సాధన, షేర్ హాస్పిటర్‌కు చెందిన డాక్టర్ జెన్నిఫర్, డాక్టర్ రోషిణి, ఐస్టోన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ హబీబా శెట్టిలపై కూడా కేసు నమోదు చేశామని, వారిని త్వరలో రెస్టు చేస్తామని ఎస్పీ వివరించారు.నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అదనపు సమాచారం కోసం విచారిస్తున్నారు.
Advertisement
Advertisement