పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది, ఎస్‌ఐల బాహాబాహి | Inspector And Lawyer Fight in Pattabiram Police Station Tamil Nadu | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది, ఎస్‌ఐల బాహాబాహి

May 15 2019 10:09 AM | Updated on May 15 2019 10:09 AM

Inspector And Lawyer Fight in Pattabiram Police Station Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు: చెన్నై సమీపంలోని పట్టాభి రాం పోలీసుస్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్, న్యాయవాది పరస్పరం దాడులు చేసుకున్నారు.  వివరాలిలా ఉన్నాయి. పట్టాభిరాం పోలీసుస్టేషన్‌లో జగదీశన్‌  సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం  ఓ కేసుకు సంబంధించి ఐనావరంకు చెందిన న్యాయవాది కార్తీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్, న్యాయవాదికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. అనంతరం ఇద్దరు వేర్వేరుగా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జాయింట్‌ కమిషనర్‌ జగదీశన్‌ను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తొలగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement