అదనపు కట్నం కోసం వేధింపులు

Husband Arrested in Extra Dowry Harassments - Sakshi

భర్త, అత్తమామలపై కేసు

తూర్పుగోదావరి , అమలాపురం టౌన్‌: భర్త, అత్తమామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ముమ్మిడివరం మండలం అనాతవరానికి చెందిన ప్రస్తుతం అమలాపురం హెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న వాసంశెట్టి శ్రీలక్ష్మి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్త మామలపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ సీహెచ్‌ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీలక్ష్మి తండ్రి ముంబైలో టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ రెండు నెలలకోసారి సొంతూరు ముమ్మిడివరం మండలం అనాతవరం వస్తూ ఉంటారు.

శ్రీలక్ష్మిని 2004 మే 28న అమలాపురం రూరల్‌ మండలం బండార్లంక గ్రామానికి చెందిన వాసంశెట్టి రాంబాబుకు ఇచ్చి వివాహం చేశారు. వారి పెళ్లి అయ్యే సమయంలో భర్త రాంబాబు ముంబైలోనే నివాసముంటున్నాడు. పెళ్లి సమయంలో తన భర్తకు కట్నం కింద రూ.ఐదు లక్షలు ఇచ్చామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ముంబైలో తన భర్త మేము అద్దెకు ఉంటున్న ఇంట్లోనే వదిలేసి తాను మాత్రం కోనసీమకు వచ్చేశాడని తెలిపింది. తనను భర్త, అత్త మామలు తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్న దృష్ట్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. ఇటీవల తన తల్లిదండ్రులు బండార్లంకలోని తమ అత్త వారి ఇంటి వద్ద ఉంచి వెళ్లారని, అప్పటి నుంచి తనను మరీ వేధిస్తున్నారని తెలిపింది. అత్త మామలపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రీలక్ష్మి ఫిర్యాదులో పేర్కొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top