సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం : ఆటో ఎక్కిన బాలికపై కామాంధుడైన డ్రైవర్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో బాలిక మౌనం వహించింది. గర్భం దాల్చడంతో గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో తొమ్మిది నెలల క్రితం జరిగిన లైంగిక దాడి గురించి వివరించింది. అబార్షన్ చేయించేందుకు తల్లిదండ్రులు యత్నించగా అప్పటికే సమయం మించిపోయింది. అబార్షన్ చేసేందుకు వీలుకాదని వైద్యులు తేల్చి చెప్పారు. బాధిత బాలిక శనివారం ఆడపిల్లకు జన్మనివ్వడంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు కట్టుబడిపాళేనికి చెందిన ఓ బాలిక తన తల్లిదండ్రులతో బుచ్చిరెడ్డిపాళెంలో బేల్దారి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో తొమ్మిది నెలల క్రితం బుచ్చిరెడ్డిపాళెం నుంచి ఆటో చెన్నూరు కట్టుబడిపాళేనికి బయల్దేరింది. రెడ్డిపాళెం దాటిన తరువాత ఆటో డ్రైవర్ ముళ్లపొదల్లోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడి మౌనం వహించింది. అయితే కాలక్రమేణా బాలికలో వస్తున్న మార్పులను గమనించిన తల్లిదండ్రులు నిలదీసేసరికి జరిగిన విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేసేందుకు ప్రయత్నించగా బాలిక ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు సూచించారు. ఈ నేపధ్యంలో బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు, బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.
బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం
Dec 24 2017 10:31 AM | Updated on Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement