భార్యకు నిప్పంటించి భర్త పరారీ | fire accident ...women injured | Sakshi
Sakshi News home page

భార్యకు నిప్పంటించి భర్త పరారీ

Dec 20 2017 8:20 AM | Updated on Sep 5 2018 9:47 PM

సాక్షి, దావణగెరె : భార‍్య శీలాన్ని శంకించిన ఒక భర‍్త ఆమెకు నిప‍్పంటించి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగువారు గమనించి ఆస‍్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ​ఆమె కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన కర్ణాటక దావణగెరె జిల్లా హరపనహళ్లి తాలూకా నందిబేవూరులో జరిగింది.  గ్రామానికి చెందిన లక్ష్మీబాయి శీలంపై ఆమె భర్త కబాడి తిప్పా నాయక తరచూ అనుమానపడుతూ వేధింపులకు గురి చేస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఇటీవల ఆమెకు నచ్చజెప్పి తిరిగి కాపురానికి పిలుచుకొచ్చిన తిప్పా నాయక తన వక్రబుద్ధిని ప్రదర్శించి ఆమెకు నిప్పంటించి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం దావణగెరె ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆలస‍్యంగా వెలుచూసిన ఈ సంఘటనపై హరపనహళ్లి పోలీసులు సోమవారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement