ఆ రాక్షసుల ఫోటోలను విడుదల చేశారు | FBI Releases Photos Of Alleged Hijackers Of Pan Am Flight 73 | Sakshi
Sakshi News home page

Jan 12 2018 11:06 AM | Updated on Apr 4 2019 3:25 PM

FBI Releases Photos Of Alleged Hijackers Of Pan Am Flight 73 - Sakshi

వాషింగ్టన్‌ : పాన్ అమెరికా ఎయిర్‌వేస్ విమాన హైజాక్‌, మారణ హోమానికి సంబంధించి ఉగ్రవాదుల ఫోటోలను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ మరోసారి విడుదల చేసింది. 1986, సెప్టెంబర్‌ 5న ముంబై నుంచి న్యూయార్క్‌ బయలుదేరిన పాన్‌ యామ్‌ ఫ్లైట్‌ 73 విమానాన్ని కరాచీలో హైజాక్‌ చేసిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.   ఆ రోజు ఏం జరిగిందంటే...

ఈ విమానంలో అటెండెంట్‌గా పనిచేస్తున్న నీర్జా భానోత్ టెర్రరిస్టుల బారి నుంచి 359 మందిని తన వంతు ప్రయత్నం చేశారు.  ప్రయాణికులు సురక్షితంకోసం  ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టారు. కానీ, ఈ క్రమంలో నీర్జాతోపాటు 20 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు.

హైజాకర్లు మహ్మద్‌ హఫీజ్‌ అల్‌ టర్కీ, జమల్‌ సయ్యిద్‌ అబ్దుల్‌ రహిమ్‌, మహ్మద్‌ అబ్దుల్లా ఖలీల్‌ హుస్సేన్‌, మహ్మద్‌ అహ్మద్‌ అల్‌ మున్వర్‌ ప్రధాన నిందితులు.  2000 సంవత్సరంలో  తొలిసారి వీరి ఫోటోలను విడుదల చేయగా.. ఇప్పుడు ఏజ్‌-ప్రోగ్రెసన్‌ టెక్నాలజీ ద్వారా వారు ఇప్పుడు ఎలా ఉంటారన్నది అంచనా వేస్తూ వారి ఫోటోలు రిలీజ్‌ చేశారు. వీళ్లల్లో ప్రతీ ఒక్కరిపై 5 మిలియన్ల అమెరికన్‌ డాలర్ల నజరానా ఉంది. వీరంతా అబు నిదల్‌ ఆర్గనైజేషన్‌ సంస్థకు చెందిన వారని.. ప్రస్తుతం వీరంతా మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నారని ఎఫ్‌బీఐ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement