కుప్పంలో భారీ వర్షం..రైతు మృతి | Farmer Died In Thunderbolt In Kuppam | Sakshi
Sakshi News home page

పిడుగుపడి రైతు, ఎద్దులు మృతి

May 25 2019 7:50 PM | Updated on May 25 2019 7:51 PM

Farmer Died In Thunderbolt In Kuppam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని కుప్పంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పిడుగుపాటుకు రైతుతో పాటు రెండు ఎద్దులు మృతి చెందాయి. వివరాలు.. కుప్పం మండలం గుడ్లనాయనపల్లికి చెందిన తిమ్మప్ప(60) పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే మృతి చెందగా.. మరో రైతు మనోహర్‌ తీవ్రగాయాలపాలయ్యాడు. దీంతో స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక జిల్లాలోని వీకోట మండలంలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది.  దీంతో బీన్స్‌, అరటి పంటలకు భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement