కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కానీ | Family Members Attempts Suicide in Chennai | Sakshi
Sakshi News home page

కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కానీ

Mar 1 2018 9:46 AM | Updated on Aug 21 2018 6:02 PM

Family Members Attempts Suicide in Chennai - Sakshi

సాక్షి, చెన్నై: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పురుగుల మందు తాగి అత్మహత్యకు ప్రయత్నించారు. ఇందులో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన చెన్నైలోని కవరపేటలో బుధవారం చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుమ్మిడిపూండి యూనియన్‌ కవరపేట సమీపంలోని అయ్యర్‌ కండ్రిగై గ్రామానికి చెందిన సెల్వం(42). గ్రామ శివారులోని కవరపేట– సత్యవేడు రోడ్డు సమీపంలో హోటల్‌ నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. 

ఈయన భార్య జయంతి(35). వీరికి మహాలక్ష్మి(17), మోనిషా(15) అనే కుమార్తెలున్నారు. వీరితో పాటు సెల్వం తల్లి వళ్లియమ్మళ్‌ (63) కూడా ఉంటుంది. మంగళవారం రాత్రి సెల్వం కవరపేట నుంచి ఇంటికి వస్తు తనతోపాటు పురుగుల మందు తీసుకువచ్చాడు. అందరూ కలిసి భోజనం చేశాక పురుగుల మందును భార్య, కుమార్తెలు, తల్లికి తాగించాడు. అనంతరం అతను తాగి కింద పడిపోయారు. పిల్లలు పెద్దగా కేకలు వేయడంతో విన్న పక్కింటివారు అక్కడికి వచ్చారు. 

తలుపులు తెరచి చూడగా అందరూ స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న కవరపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం చెన్నై ప్రభుత్వ స్టాన్లీ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెల్వి తల్లి వళ్లియమ్మాళ్‌ బుధవారం మృతి చెందింది. మిగిలిన నలుగురుకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసును విచారణ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement