మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తూ.. | Explosive Materials Siezed In Charla | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తూ..

Aug 7 2018 9:48 AM | Updated on Oct 9 2018 2:49 PM

Explosive Materials Siezed In Charla - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తోన్న ఇద్దరు సానుభూతిపరులను ఖమ్మం జిల్లా చర్లలో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చర్ల: మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తోన్న ఇద్దరు సానుభూతిపరులను ఖమ్మం జిల్లా చర్లలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. చర్ల -పూసుగుప్ప మార్గంలోని లెనిన్‌ కాలనీ శివారులో పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో అదే మార్గంలో ఈ ఇద్దరూ వస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు లభించాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మావోయిస్టులకు సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement