ఇంజనీరింగ్‌ విద్యార్థి అదృశ్యం | Engineering Student missing in LB nagar | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థి అదృశ్యం

Oct 13 2017 1:25 PM | Updated on Sep 4 2018 5:07 PM

నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌​పరిధిలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి అదృశ్యమయ్యాడు.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌​పరిధిలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి అదృశ్యమయ్యాడు. సహారా ఎస్టేట్‌ కాలనీకి చెందిన సాత్విక్‌ రెడ్డి ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో సాత్విక్‌ తల్లిదండ్రులు ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన విద్యాసాగర్‌ రెడ్డి తమ పిల్లల చదువుల కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. తమ కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement