ప్రేమ జంటలను ఉపేక్షించేది లేదు.. | Crime Rate Rises in Tamil nadu | Sakshi
Sakshi News home page

రెండు రోజులకో హత్య

Jun 24 2019 12:47 PM | Updated on Jun 24 2019 5:13 PM

Crime Rate Rises in Tamil nadu - Sakshi

వివాహేతర సంబంధాలే కారణం

సాక్షి ప్రతినిధి, చెన్నై: బహిరంగ నేరాలను పోలీసులు అడ్డుకుంటారు. మరి వివాహేతర సంబంధాల నేపథ్యంలో చాటుమాటు ఘాతుకాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రికార్డుల ఆధారంగా గడిచిన పదేళ్లలో తమిళనాడులోని 1,459 హత్యలు వివాహేతర సంబంధాల వల్లనే జరిగినట్లు స్పష్టమైంది. సేలం జిల్లాకు చెందిన ఒక గృహిణి కనిపించకుండాపోయిన తన 19 ఏళ్ల తన కుమార్తెను కోర్టులో ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ అడ్‌కొనర్వు పిటిషన్‌ను ఇటీవల దాఖలు చేసింది. పెళ్లయి, పిల్లలు కలిగిన తన మేనమామ లోకనాథన్‌తోనే ఆమె కుమార్తె వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే యువతిని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. సినీ నటీమణులు కనిపించకుండా పోతే నే గాలింపు చేస్తారా, సాధారణ యువతులను పట్టించుకోరా అని న్యాయమూర్తులు పోలీసులకు ప్రశ్నించారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచా రణకు వచ్చింది.

కోర్టు ఆదేశాలతో చెన్నై లా అండ్‌ ఆర్డర్‌ ఐజీ ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. గత పదేళ్లలో చెన్నైలో వివాహేతర సంబంధాల వల్ల 1,459 హత్యలు జరిగాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పదేళ్లు అంటే 3,650 రోజులు. 3,650 రోజుల్లో 1,459 హత్యలు అంటే రెండురోజులకో హత్య జరిగిందన్నమాట. ఈ హత్యలన్నీ వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన వే కారణం గమనార్హం. యువత పెడదారి పట్టడానికి ఇంట ర్నెట్, సెల్‌ఫోన్లలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అశ్లీల వెబ్‌సైట్లే ప్రధాన కారణమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్‌ ఖుద్దూస్‌ అవేదన వ్యక్తం చేశారు. ఐజీ కోర్టుకు సమర్పించిన వివరాలను పరిశీలించి కంగుతిన్న న్యాయమూర్తులు.. సమాజంలో పె చ్చుమీరిపోయిన వివాహేతర సంబంధాల సం స్కృతికి మూలకారణం అరచేతిలో (సెల్‌ఫోన్లు) అశ్లీల వెబ్‌సైట్లు అందుబాటులోకి రావడమేనని వ్యాఖ్యానించారు. కొన్ని సినిమాలు సైతం యువతను పెడదారి పట్టిస్తున్నాయని ఆక్షేపించారు.

రైల్వేస్టేష్టన్లలో ‘మూడో కన్ను’
ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్లకు చేరుకునే జంటలను ఉపేక్షించేది లేదని పోలీస్‌శాఖ హెచ్చరించింది. 136 రైల్వేస్టేషన్లలో ‘మూడో కన్ను’ ఏర్పాటుతో ప్రేమజంటలపై నిఘా పెడుతున్నామని పేర్కొంది. చెన్నై నగరం, శివార్లలోని పలు ప్రాంతాలను కలుపుతూ పయనించే లోకల్‌ రైళ్లలో రోజుకు 8 లక్షల మందికి పైగా ప్రయాణిస్తుంటారు. చెన్నై నగరంలోని మాంబళం, తాంబరం తదితర పలులోకల్‌ స్టేషన్లలో కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఆగుతాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కోసం వేరే రైల్వే ట్రాక్‌ కూడా ఉంది. రైలు ప్రయాణికుల వసతి కోసం అనేక కుర్చీలను ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఈ కుర్చీల్లో ప్రయాణికుల కంటే ప్రేమ జంటలే ఆక్రమించుకుని ఉంటారు. గంటల తరబడి ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇదే కోవలో చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో 2016లో స్వాతి అనే ఐటీ ఉద్యోగిని ఒక యువకుడు ముచ్చట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆగ్రహం చెందిన యువకుడు వేటకొడవలితో స్వాతిపై దాడిచేసి దారుణహత్య చేశాడు.

అలాగే ఈరోడ్‌కు చెందిన తేన్‌మొళి అనే ప్రభుత్వ ఉద్యోగినిపై చెన్నై చెట్‌పట్‌ రైల్వేస్టేష్టన్‌లో పదిరోజుల క్రితం హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు ఈనెల 21వ తేదీన ప్రాణాలు విడిచాడు. చెన్నై లోకల్‌ రైల్వేస్టేషన్లలో ప్రేమజంటలు గంటల కొద్దీ బాతాఖాని కొట్టే దృశ్యాలను చూస్తున్న నగరవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ కబుర్లు చెప్పుకునేందుకే రైల్వేస్టేషన్‌కు వచ్చే జంటలపై చర్యలు చేపడతామని పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రేమ జంటలపై రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సు పోలీసులు నిఘాపెట్టి ఎక్కువ సేపు కూర్చుని ఉంటే రైల్లో ఎక్కించడమో లేక స్టేషన్‌ నుంచి వెళ్లగొట్టడమో చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన విద్యార్థులు, ఉద్యోగుల గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకుని కమిషనర్‌ కార్యాలయంలో అప్పగించాలని, సదరు విద్యాసంస్థలకు, కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలని కింది స్థాయి పోలీసులకు ఆదేశాలందాయి. స్వాతి హత్య జరిగిన నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌ సహా 82 స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే చెన్నై చేట్‌పట్‌లో చోటుచేసుకున్న తాజా హత్యాయత్నం తరువాత ప్రేమజంటల కదలికలపై నిఘా పెట్టేందుకు మరో 136 రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement