రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి | Couple Died In Road Accident At Tukkuguda | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Sep 1 2018 9:47 AM | Updated on Jul 10 2019 7:55 PM

Couple Died In Road Accident At Tukkuguda - Sakshi

స్కూటర్‌పై వెళ్తున్న దంపతులను కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్‌పై వెళ్తున్న దంపతులను కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త సప్పిడి దశరథ అక్కడికక్కడే మృతిచెందగా..భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందింది. మృతులు తుక్కుగూడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement