
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయికుటీర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. పద్మావతి ఫంక్షన్ హాల్ యజమాని సుజన్ రెడ్డి, ఆయన భార్య హారిక రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య కారణాల వల్లే దంపతులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.