సెల్‌ఫోన్‌ బ్యాటరీని రాయితో కొట్టగా.. విషాదం | Child Wounded In Cell Phone Battery Blast | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ బ్యాటరీ పేలి.. బాలుడి పరిస్థితి విషమం

Nov 21 2018 3:32 PM | Updated on Apr 3 2019 3:52 PM

Child Wounded In Cell Phone Battery Blast - Sakshi

బ్యాటరీ పేలడంతో  గాయాలపాలైన బాలుడు 

రాయగడ : జిల్లాలోని కాశీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల తొలొజొరి గ్రామ పంచాయతీలోని మొంకొడొ గ్రామంలో పారవేసిన బ్యాటరీ పేలి ఒక బాలుడి తల, చేయి, తొడలకు తీవ్రమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.  మొంకొడొ గ్రామానికి చెందిన కునమజ్జి కుమారుడు సునాసింగ్‌ (8) గ్రామంలో ఆరుబయట ఆడుకుంటూ  పనిచేయని సెల్‌ఫోన్‌ బ్యాటరీని కాలితో తన్నుకుంటూ వెళ్లి ఒక ప్రాంతంలో ఆ బ్యాటరీని రాయితో కొట్టగా హఠాత్తుగా   ఆ బ్యాటరీ పేలడంతో గాయాలపాలయ్యాడు. గాయాల పాలైన బాలుడికి తొలుత కాశీపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్సి చేసి అనంతరం 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement