చిక్కుల్లో ఆ ముగ్గురు | Case Against Raveena Tandon, Farah Khan and others | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో ఆ ముగ్గురు

Dec 26 2019 6:03 PM | Updated on Dec 26 2019 6:07 PM

Case Against Raveena Tandon, Farah Khan and others - Sakshi

రవీనా టాండన్‌, ఫరా ఖాన్‌, భారతి సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

అమృత్‌సర్‌: బాలీవుడ్‌ సెలబ్రిటీలు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పంజాబ్‌లో కేసు నమోదైంది. ఒక టెలివిజన్‌ షోలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్న ఫిర్యాదుపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.  

క్రిస్మస్‌ సందర్భంగా ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్‌, ఫరాఖాన్‌, భారతి సింగ్‌ క్రిస్టయన్‌ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్  అజ్నాలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు  చేసినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. సంబంధిత షో వీడియో ఫుటేజీని కూడా ఫిర్యాదుదారుడు అందించినట్టు తెలిపారు.  295 -ఏతోపాటు వివిధ సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని అమృతసర్ రూరల్‌ పోలీసు అధికారి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement