ఇద్దరిని బలిగొన్న రోడ్డు ప్రమాదం | Car Rollover in Karnataka To Telangana Men Deceased | Sakshi
Sakshi News home page

ఇద్దరిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

May 1 2020 8:03 AM | Updated on May 1 2020 8:03 AM

Car Rollover in Karnataka To Telangana Men Deceased - Sakshi

భార్యతో మృతుడు గోపాల్‌(ఫైల్‌)

కర్ణాటక ,రాయచూరు రూరల్‌: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని బోల్తా పడి తెలంగాణకు చెందిన ఇద్దరు  దుర్మరణం చెందారు. ఈ ఘటన రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా జవళగేర వద్ద గురువారం తెల్ల వారు జామున చోటు చేసుకుంది. తెలంగాణలోని గద్వాల తాలూకా కాళ తిమ్మన దొడ్డి(కేటీదొడ్డి)కి చెందిన నల్ల హనుమంతు కుమారుడు గోపాల్‌ (29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయనకు గత ఏడాది ఐజకు చెందిన చంద్రకళతో వివాహమైంది.

ఈదంపతులు మరో ముగ్గురితో కలిసి  బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి వెళుతుండగా జవళగేరి వద్ద   వాహనం అదుపు తప్పి తప్పి చెట్టును ఢీకొని పక్కనే ఉన్న పొలంలోకి బోల్తాపడింది.  ఘటనలో గోపాల్, కారు డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించారు. చంద్రకళకు రెండు కాళ్లకు గాయాలయ్యాయి. కొర్విపాడుకు చెందిన మహిళ, మరొకరు గాయపడగా రాయచూరు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. సింధనూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement