20 ఎకరాల అరటితోట దగ్ధం | Banana Crop Fired in YSR Kadapa | Sakshi
Sakshi News home page

20 ఎకరాల అరటితోట దగ్ధం

May 10 2019 12:59 PM | Updated on May 10 2019 12:59 PM

Banana Crop Fired in YSR Kadapa - Sakshi

మంటలను ఆర్పివేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

వైఎస్‌ఆర్‌ జిల్లా, ఎస్‌ఆర్‌పురం(రాజంపేట రూరల్‌) : మండల పరిధిలోని ఎస్‌ఆర్‌ పురంలో 20 ఎకరాల భూమిలో ఉన్న అరటితోట అగ్నికి ఆహుతి అయింది. గురువారం మధ్యాహ్నం సమయంలో విద్యుత్‌ తీగల మధ్య రాపిడికి  నిప్పులు పడి మంటలు చెలరేగడంతో నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో పోకల ప్రభాకర్‌ కుటుంబానికి చెందిన 15 ఎకరాలు, గుర్రకొండ ఈశ్వర జయప్రకాష్‌కు చెందిన ఐదు ఎకరాల పొలం బూడిద పాలైంది. ఒక్కసారిగా ఎగిసిపడటంతో ఆర్పేందుకు రైతులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ ఆఫీసర్‌ టి. టిబన్‌ సిబ్బందితో కలిసి ఎగిసిపడుతున్న మంటలు ఆర్పివేశారు. ఆ సమయానికే 20 ఎకరాలలోని అరటి తోటలో ఉన్న దాదాపు వేలాది అరటి చెట్లు దగ్ధమయ్యాయి. అలాగే డ్రిప్‌ పరికరాలు, లేటర్లు కూడా కాలిపోయాయి. చేతికి వచ్చిన పంటతో పాటు, డ్రిప్‌ పైపులు, లేటర్లు కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రూ.5 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. కాగా ఈ మంటల ధాటికి పక్కనే ఉన్న అడవి కూడా అంటుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement