కాన్పు చేసిన నర్సులు | baby killed because of Nurses did the Delivery | Sakshi
Sakshi News home page

కాన్పు చేసిన నర్సులు

Aug 14 2018 1:40 AM | Updated on Aug 14 2018 1:40 AM

కల్వకుర్తి టౌన్‌: వైద్యులు లేకుండా నర్సులే ఓ మహిళకు ప్రసవం చేయడంతో వారి ప్రయత్నం వికటించి శిశువు మృతి చెందింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్‌ఐ రవి కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్‌కు చెందిన మంగమ్మ కాన్పు కోసం సోమవారం ఉదయం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబీకులతో కలసి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాయంత్రం సాధారణ కాన్పు కోసం సిద్ధం చేయాలని నర్సులకు సూచించి వెళ్లిపోయారు.

మంగమ్మకు నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు రాకపోవటంతో నర్సులే కాన్పు చేస్తుండగా.. బిడ్డకు పేగు చుట్టుకుని ఉండటంతో ఆందోళన చెందిన నర్సులు వైద్యుడు శివరాంకు ఫోన్‌ లో సమాచారం ఇవ్వగా ఆయన వచ్చేటప్పటికే మగ శిశువు చనిపోయాడు. నర్సులు కాన్పులు చేయొచ్చా అని శివరాంను అడిగితే.. ‘సాధారణ కాన్పులు చేయొచ్చు, కానీ క్లిష్ట పరిస్థితి ఎదురైతే వైద్యులకు సమాచారం ఇస్తారు’అని పేర్కొన్నారు. ఈ విషయం తెలియగానే కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రవి హుటాహుటిన చేరుకుని బాధితులతో మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement