జింకల మాంసం విక్రయ కేంద్రంపై దాడి

Attack on the deer meat market - Sakshi

పోలీసుల అదుపులో నిందితుడు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): వన్యప్రాణులను వేటాడి, వధించి విక్రయిస్తున్న కేంద్రంపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఒక జింకతో పాటు, మరో రెండు జింకల తలలు, మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఒక వేటగాడిని అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారయ్యారు. వివరాలు.. ముస్తాబాద్‌ మండలం మోహినికుంట శివారులో జింక మాంసం విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు విక్రయ కేంద్రంపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ వేటగాళ్లు సూత్రం రాజయ్య(44), వానరాశి ఎల్లయ్య(45), ఉబిది యాదగిరి(30) జింక మాంసం విక్రయిస్తున్నారు.

పోలీసులను చూసిన యాదగిరి, ఎల్లయ్య పరారు కాగా, రాజయ్య పోలీసులకు చిక్కాడు. మధ్యాహ్నం సమీప అడవుల నుంచి మూడు జింకలను వేటాడి తెచ్చారు. ఇందులో రెండు పిల్ల జింకలను కోసి మాంసం విక్రయించే క్రమంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. గాయపడ్డ తల్లి జింకతోపాటు, మాంసం, రెండు ద్వి చక్రవాహనాలను స్వా«ధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల చట్టం కింద పరారీలో ఉన్న ఎల్లయ్య, యాదగిరితోపాటు పట్టుబడ్డ రాజయ్యపై కేసులు నమోదు చేసినట్లు అటవీశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ సరిత తెలిపారు. గాయపడ్డ జింకకు వైద్యం అందించి కరీంనగర్‌ డీర్‌ పార్క్‌కు తరలిస్తామన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top