 
															మాల్యాను వెనక్కి రప్పిస్తాం
రుణాలు ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న వ్యాపార వేత్త విజయ మాల్యా దేశానికి తిరిగి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
	
	న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న  వ్యాపార వేత్త విజయ మాల్యా వ్యవహారంలో కేంద్ర ఆర్థిక  మంత్రి అరుణ్  జైట్లీ స్పందించారు. అతణ్ణి దేశానికి తిరిగి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.  సోమవారం మీడియాతో మాట్లాడిన  జైట్లీ  మనీ లాండరింగ్  ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి  దేశానికి తీసుకురావడానికి దర్యాప్తు సంస్థలు  అన్ని ప్రయత్నాలు  చేస్తాయన్నారు.   ఈ మేరకు ప్రభుత్వం  అన్ని చర్యలు  తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.
	
	ఆయన్ని ఇండియాకు రప్పించడానికి రెండు ప్రత్యేక మార్గాలు ఉన్నాయన్నారు. , ఒకటి బహిష్కరణ  మరొకటి రప్పించడమని తెలిపారు.  ఈ విషయంలో  బ్రిటన్  తమకు  సహాయపడేలా లేదన్నారు.   ఒకసారి ఎవరైనా చట్టబద్ధంగా వారి  దేశంలోకి ప్రవేశించిన వ్యక్తిని  ఆదేశం  బహిష్కరిందని  జైట్లీ అన్నారు.   పాస్ పోర్ట్ రద్దు చేయడం  దేశ బహిష్కరణ కింద రాదనే వైఖరిని   బ్రిటన్ ప్రభుత్వం  తీసుకుందన్నారు.  మరోవైపు కోర్టులో అభియోగాలు నమోదై  చార్జిషీటు దాఖలైన  తరువాత మాల్యాను దేశానికి రప్పించే ప్రయత్నాలు చట్ట ప్రకారం చేయొచ్చన్నారు.  అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని  యూకే ..మాల్యా ను అప్పగించే దిశగా దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాలని  సూచించారు.  ఇదే విషయంలో పార్లమెంటులో కూడా  ప్రస్తావించిన  జైట్లీ   ఛార్జిషీట్ దాఖలైన తర్వాత భారతదేశానికి  రప్పించే  ప్రక్రియ ప్రారంభకానుట్టుతెలిపారు.  
	
	
	కాగా బ్యాంకుల కన్సార్టియానికి   9  వేలకు కోట్లకు పైగా  బాకీ పడ్డ విజయ్ మాల్యా గత మార్చి 2 న భారతదేశం విడిచి బ్రిటన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
