4జీ సేవల్లోకి యునినార్.. | Uninor to invest Rs 600 crore towards capex in current year | Sakshi
Sakshi News home page

4జీ సేవల్లోకి యునినార్..

Sep 26 2014 1:34 AM | Updated on Sep 2 2017 1:57 PM

4జీ సేవల్లోకి యునినార్..

4జీ సేవల్లోకి యునినార్..

టెలికం కంపెనీ యునినార్ 4జీ రంగంలోకి అడుగు పెడుతోంది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ యునినార్ 4జీ రంగంలోకి అడుగు పెడుతోంది. సబ్‌సే సస్తా పేరుతో ఇతర టెల్కోల కంటే తక్కువ ధరకే సర్వీసులను ఆఫర్ చేస్తున్న యునినార్.. 4జీలోనూ ఇదే పంథా కొనసాగిస్తామని చెబుతోంది. ఇదే నిజమైతే భారత టెలికం రంగంలో సంచలనమేనని చెప్పొచ్చు. అయితే ఈ ఏడాది 4జీ పరీక్షల వరకే కంపెనీ పరిమితమవుతోంది. 4జీ మొబైల్ ఫోన్ల ధరలు ఖరీదుగా ఉండడం, మోడళ్లు పరిమితంగా ఉండడమే ఇందుకు కారణమని యునినార్ సీఈవో మోర్టెన్ కార్ల్‌సన్ సోర్బీ తెలిపారు. సెల్ఫ్ కేర్ టూల్ ను గురువారమిక్కడ ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

 4జీ మొబైల్ ఫోన్లు..!
 అందుబాటు ధరలో 4జీ మొబైల్ ఫోన్లను అందించేందుకు శాంసంగ్, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలతో యునినార్ చర్చిస్తోంది. బండిల్ ఆఫర్ కింద మొబైల్ ఫోన్లు, డాటా అందించాలన్నది ప్రణాళిక అని సోర్బీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఇటీవలే బండిల్ ఆఫర్‌లో మొజిల్లా ఫోన్లను ప్రవేశపెట్టి విజయవంతం అయ్యామని చెప్పారు. ‘3జీ సేవల్లోకి కూడా ప్రవేశించే ఆలోచన ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement