
సాక్షి, ముంబై : స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలం సంకేతాలతో కీలక సూచీల్లో నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు క్షీణించి 39145 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలహీనపడి 11667 వద్దకొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు లాభపడుతుడగా, ఆటో, ఐటీ నష్టపోతోంది. ప్రధానంగా యస్‌బ్యాంకు భారీ నష్టాలతో అయిదేళ్ల కనిష్టానికి చేరింది. మార్కెట్ క్యాప్ కూడా దారుణంగా పడిపోయింది. మరోవైపు ఎస్‌బీఐ, పీఎన్‌బీ లాభపడుతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. 5 పైసలు బ లపడి రూ. 68.76 వద్ద ప్రారంభమైంది. బుధవారం 68.81 వద్ద ముగిసింది.