27వేలకు పైన స్థిరంగా సెన్సెక్స్ | Sensex reclaims 27,000 mark, rises 145.19 pts to end at 27,1.91; Nifty climbs 40.60 pts to | Sakshi
Sakshi News home page

27వేలకు పైన స్థిరంగా సెన్సెక్స్

Jul 1 2016 4:05 PM | Updated on Nov 9 2018 5:30 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి.

ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో  ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ మార్కెట్ సూచీలు  భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే   వారాంతం కావడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో 145  పాయింట్ల లాభంతో 27,144  దగ్గర బలంగా  క్లోజ్ అయింది. నిఫ్టీ 40 పాయింట్ల  లాభంతో  8328 దగ్గర ముగిసింది.  మరోవైపు  చాలా కాలం తరువాత సెన్సెక్స్ 27 వేల పాయింట్లకు పైన, నిఫ్టీ 8వేల 3వందల పాయింట్లకు పైన  స్థిరంగా నిలబడటం  సానుకూల సంకేతం. దాదాపు అన్ని రంగాల  షేర్లలోనూ  కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపించింది. హెల్త్ కేర్, ఆటోమొబైల్,  కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ లో లాభాలను ఆర్జించాయి.

అలాగే  గ్లోబల్  చమురు ధరలు మరింత  పుంజుకున్నాయి. అటు కరెన్సీ మార్కెట్లు, బులియన్ మార్కెట్ రెండూ  పాజిటివ్ వుండడం విశేషం.  ఇటీవల బాగా బలపడుతున్న  రూపాయి విలువ  కూడా మార్కెట్ కు సంపూర్ణ మద్దతినిస్తోంది.   కరెన్సీ మార్కెట్లో డాలర్  తో  పోలిస్తే రూపాయి 0.13  పైసల లాభంతో 67.44 దగ్గర రూపాయి విలువ  ఉంది.  బంగారం కూడా దాదాపు   మూడువందల  రూపాయలు  లాభంతో 31 వేల మార్క్  దగ్గర  స్థిరంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement