సెన్సెక్స్ మద్దతు 27,650... | Sensex flirts with 28K; 5 events to watch out this coming week | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ మద్దతు 27,650...

Jul 18 2016 6:20 AM | Updated on Sep 4 2017 5:16 AM

అమెరికాలో జాబ్స్ డేటాతో పాటు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ వినియోగం పెరిగినట్లు గణాంకాలు వెలువడి, ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఇన్వెస్టర్లు గతంలోలా భయపడటం లేదు.

మార్కెట్ పంచాంగం
అమెరికాలో జాబ్స్ డేటాతో పాటు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ వినియోగం పెరిగినట్లు గణాంకాలు వెలువడి, ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఇన్వెస్టర్లు గతంలోలా భయపడటం లేదు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతున్న ప్రభావాన్ని కొద్దినెలలపాటు పరిశీలించిన తర్వాత ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వుంటుందన్న అంచనాలే ఇందుకు కారణం. గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత నిర్భయంగా భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్లన్నీ ర్యాలీ జరుపుతున్నాయి. ఇప్పటికే అమెరికా మార్కెట్ రికార్డు గరిష్టస్థాయిని చేరగా, యూరప్‌తో సహా ఇతర ప్రధాన మార్కెట్లన్నీ ఏడాది గరిష్టస్థాయిలో వున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యమైన అంతర్జాతీయ ప్రతికూల సంఘటనలేవీ ఎదురుకాకపోతే, భారత్ మార్కెట్ కూడా కొత్త రికార్డును ఈ ఏడాదే నెలకొల్పే ఛాన్స్ వుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకొస్తే...

 సెన్సెక్స్ సాంకేతికాలు...
జూలై 15తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాగంలో అంచనాలకు అనుగుణంగా 27,618 పాయింట్ల స్థాయిని దాటిన తర్వాత 28,048 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 710 పాయింట్ల భారీలాభంతో 27,837 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ వారం మార్కెట్ పెరిగితే సెన్సెక్స్‌కు 28,100 పాయింట్ల సమీపంలో తొలి అవరోధం కలగవచ్చు. ఆపైన ముగిస్తే 28,250 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. కొద్ది వారాల్లో 28,580 పాయింట్ల స్థాయిని కూడా అందుకోవొచ్చు. తొలి అవరోధస్థాయిని అధిగమించలేకపోతే గత వారం మార్కెట్ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన గ్యాప్‌లు ఈ వారం మద్దతుల్ని అందించవచ్చు. ఈ ప్రకారం  26,650 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ దిగువన మద్దతుస్థాయిలు 27,380, 27,035 పాయింట్లు  మొత్తం మీద రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు 28,000-28,500 పాయింట్ల శ్రేణి మధ్య పలు అవరోధాలు ఎదురవుతుండగా, 27,000-27,650 పాయింట్ల శ్రేణి మధ్య వరుసగా మద్దతులు లభిస్తున్నాయి.

 నిఫ్టీ మద్దతు 8,475
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం 218 పాయింట్ల పెరుగుదలతో 8,541 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరుగుదల కొనసాగాలంటే తొలుత 8,550 పాయింట్లపైన స్థిరపడాల్సివుంటుంది. ఆపైన గత ఏడాది జులై టాప్ అయిన 8,655 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఆపైన స్థిరపడితే కొద్ది రోజుల్లో క్రమేపీ 8,845 పాయింట్ల వద్దకు చేరే ఛాన్స్ వుంటుంది. 8,655 పాయింట్లపైన అవరోధస్థాయిలు 8,700, 8,760 పాయింట్లు. ఈ వారం 8,550 స్థాయిపైన స్థిరపడలేకపోతే 8,475 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 8,400 స్థాయికి పడిపోవొచ్చు. ఈ దిగువన 8,320-8,350 పాయింట్ల శ్రేణికి తగ్గే అవకాశాలుంటాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement