సత్యం కుంభకోణం కేసు... | Satyam scam case .. | Sakshi
Sakshi News home page

సత్యం కుంభకోణం కేసు...

Jun 28 2014 12:41 AM | Updated on Sep 5 2018 1:38 PM

సత్యం కుంభకోణం కేసు... - Sakshi

సత్యం కుంభకోణం కేసు...

సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టెక్ మహీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి.

టెక్ మహీంద్ర పిటిషన్‌పై 30న హైకోర్టు తీర్పు
 
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టెక్ మహీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఈ నెల 30న తీర్పు వెలువరిస్తానని స్పష్టం చేశారు. సత్యం కంప్యూటర్స్‌పై నమోదు చేసిన కేసును ఆ కంపెనీని విలీనం చేసుకున్న తరువాత కూడా ఈడీ తమపై కొనసాగిస్తూ చార్జిషీట్‌లో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాలు టెక్ మహీంద్ర హైకోర్టును ఆశ్రయించింది.

కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపించారు. సత్యం కుంభకోణం తరువాత ఆ కంపెనీ బాధ్యతలు చూడాలని కేంద్రం కోరితేనే తాము ఆ బాధ్యతలు స్వీకరించామని, అటువంటి తమను నిందితుల జాబితాలో చేర్చడం ఎంత మాత్రం సరికాదని తెలిపారు. సత్యం కంప్యూటర్స్, టెక్ మహీంద్ర విలీనానికి ఆమోదముద్ర వేస్తూ ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని, సత్యంపై ఉన్న కేసులన్నింటికీ కూడా టెక్ మహీంద్ర బాధ్యత వహించాలని ఆ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.

Advertisement
 
Advertisement
Advertisement