టెలినార్‌ అపరిమిత కాల్స్‌ | Reliance Jio Effect: Telenor Offers Unlimited Voice Calls and internet | Sakshi
Sakshi News home page

టెలినార్‌ అపరిమిత కాల్స్‌

Dec 27 2016 1:10 AM | Updated on Sep 4 2017 11:39 PM

టెలినార్‌ అపరిమిత కాల్స్‌

టెలినార్‌ అపరిమిత కాల్స్‌

టెలికం కంపెనీ టెలినార్‌ అన్‌ లిమిటెడ్‌ వాయిస్, ఇంటర్నెట్‌ ప్లాన్స్‌ను 28 రోజుల కాల పరిమితితో ప్రకటించింది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్‌ అన్‌ లిమిటెడ్‌ వాయిస్, ఇంటర్నెట్‌ ప్లాన్స్‌ను 28 రోజుల కాల పరిమితితో ప్రకటించింది. రూ.249 వోచర్‌తో అపరిమితంగా లోకల్, ఎస్టీడీ కాల్స్‌ చేసుకోవచ్చు. అలాగే 1 జీబీ 4జీ, అన్‌లిమిటెడ్‌ 2జీ డేటా పొందవచ్చు. రూ.74 వోచర్‌తో టెలినార్‌ నుంచి టెలినార్‌కు దేశవ్యాప్తంగా అపరిమితంగా కాల్స్‌ చేయొచ్చు. దీనితోపాటు 1 జీబీ 4జీ/2జీ డేటా కూడా ఉచితమని కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్‌ బిజినెస్‌ హెడ్‌ శ్రీనాథ్‌ కొటియన్‌ ఈ సందర్భంగా తెలిపారు.

టాటా డొకొమో సైతం..: మరో టెలికం కంపెనీ టాటా డొకొమో మూడు ప్లాన్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. రూ.246 ప్యాక్‌తో దేశవ్యాప్తంగా అన్ని కాల్స్‌ ఉచితం. 2 జీబీ డేటా దీనికి అదనం. కాల పరిమితి 28 రోజులు. 14 రోజుల వాలిడిటీ గల రూ.148 ప్యాక్‌తో అన్ని కాల్స్‌ ఫ్రీ. అలాగే 1 జీబీ డేటా ఉచితం. రూ.103 ప్లాన్‌తో దేశవ్యాప్తంగా డొకొమో నుంచి డొకొమో కు అపరిమితంగా కాల్స్‌ చేసుకోవచ్చు. 500 ఎంబీ డేటా ఉచితం. 28 రోజుల కాల పరిమితి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement