మొబైల్ పేమెంట్ యాప్‌లకు భారీ జరిమానా | RBI Penalises Five PPI issuers | Sakshi
Sakshi News home page

మొబైల్ పేమెంట్ యాప్‌లకు భారీ జరిమానా

May 4 2019 6:54 PM | Updated on May 4 2019 7:07 PM

RBI Penalises Five PPI issuers - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, ముంబై :  రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా  ఫోన్‌పేతో సహా నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) సంస్థలకు  భారీ జరిమానా విధించింది.   ముఖ్యంగా  వొడాఫోన్ ఎం-పేసా, ఫోన్‌ పే మొబైల్ పేమెంట్స్, వై-క్యాష్ తదితర సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు ప్రమాణాలు పాటించని అమెరికా సంస్థలు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్‌పైనా ఆర్బీఐ కొరడా ఝళిపించింది.  చెల్లింపులు, సెటిల్మెంట్స్ వ్యవస్థల చట్టం- 2007 కింద ఆయా సంస్థలకు ద్రవ్య పెనాల్టీ విధించినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

వొడాఫోన్‌ ఎం-పేసాకు రూ.3.05 కోట్ల జరిమానా, మొబైల్ పేమెంట్స్, ఫోన్ పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీలకు రూ.1 కోటి చొప్పున జరిమానా విధించింది. వై-క్యాష్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కి కూడా రూ. 5 లక్షల పెనాల్టీ విధించింది. వీటితోపాటు  వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్ సంస్థలకు వరుసగా రూ. 29.66 లక్షలు, రూ. 10.11 లక్షల మేర ఆర్‌బీఐ జరిమానా విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement