దివాలా ప్రక్రియకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

RBI To Begin Bankruptcy Proceedings Against Shadow Lender DHFL - Sakshi

బెంగళూర్‌ : హౌసింగ్‌ ఫైనాన్స్‌ దిగ్గజ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై దివాలా ప్రక్రియను చేపడుతున్నట్టు ఆర్‌బీఐ బుధవారం వెల్లడించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బోర్డును తొలగించిన ఆర్‌బీఐ దివాలా ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది. డీహెచ్‌ఎల్‌ఎఫ్‌ను ఆర్‌బీఐ తదుపరి చర్యల నిమిత్తం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు తరలించనుంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వివిధ బ్యాంకులు, మ్యూచ్‌వల్‌ ఫండ్లు సహా రుణదాతలకు రూ లక్ష కోట్ల వరకూ రుణాలను చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థలనూ దివాలా చట్టం కిందకు తీసుకువస్తూ ఈనెల 15న నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై దివాలా ప్రక్రియ చేపట్టడం గమనార్హం. డీహెచ్‌ఎల్‌ఎఫ్‌తో పాటు అల్టికోపైనా దివాలా పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top