తగ్గిన పెట్రోలు, డీజిల్‌ ధరలు | Petrol, Diesel Prices Coming Down | Sakshi
Sakshi News home page

తగ్గిన పెట్రోలు, డీజిల్‌ ధరలు

Nov 8 2018 8:16 AM | Updated on Nov 8 2018 8:17 AM

Petrol, Diesel Prices Coming Down - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి రోజు యథాతథంగా కొనసాగిన ఇంధన ధరలు నేడు( గురువారం, నవంబరు 8) తగ్గుముఖం పట్టాయి. పెట్రోలుపై లీటరుకు సగటున 21పైసలు, డీజిల్‌ పై 18పైసలు ధర  తగ్గింది.  దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర  లీటరు రూ. 78.21కు చేరుకోగా, డీజిల్ ధర లీటరు రూ. 72.89కు చేరింది.

హైదరాబాద్‌:  లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 82. 93,  డీజిల్ 22 పైసలు తగ్గి లీటరు రూ. 79.31 కు చేరింది.
విజయవాడ: లీటర్ పెట్రోల్ 82.11, డీజిల్ ధర రూ. 78.08
ముంబై:  లీటర్ పెట్రోల్ ధర రూ.83.72, డీజిల్ ధర రూ.76.38గా ఉంది.
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ. 81.24, డీజిల్ ధర రూ.77.05
కోలకతా: లీటర్ పెట్రోల్  రూ. 80.13, డీజిల్ ధర రూ.74.75

అంతర్జాతీయంగా ముడి చమురు  ధరలు  క్రమంగా దిగి వస్తున్న తరుణంలో దేశీయంగా   కూడా  పెట్రోలు , డీజిల్‌ ధరలు  వాహన దారులకు మరింత ఊరట కల్పించనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement