విదేశీ విద్యకు క్లిక్ దూరం!

విదేశీ విద్యకు క్లిక్ దూరం!


స్కాలర్‌షిప్ టు ఇంటర్న్‌షిప్.. అన్నీ ఒకేచోట

♦  we make scholars.com ద్వారా రూ.20 కోట్ల స్కాలర్‌షిప్‌లు

1,300 మంది క్లయింట్లు: ఇందులో 800 విదేశీ వర్సిటీలే

♦  1,300 సంస్థలతో ఒప్పందం..


 

 మా సైట్‌లో విదేశీ వర్సిటీల స్కాలర్‌షిప్‌లతో పాటూ అనిత, ఆగాఖాన్, కామన్‌వెల్త్ ఫౌండేషన్లు, గూగుల్, టాటా, ఫెయిర్ అండ్ లవ్లీ వంటి కార్పొరేట్ సంస్థల సంస్థల ఉంటుంది. ఇప్పటివరకు మొత్తం 1,300 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇందులో 800 వరకు విదేశీ వర్సిటీలున్నాయి. గ్రాడ్యుయేషన్ మాత్రమే కాదు పీజీ, పరిశోధన విద్యనభ్యసించే వాళ్లూ మా సేవలను వినియోగించుకోవచ్చు. స్కాలర్‌షిప్‌ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, డేటాను అప్‌లోడ్ చేయడానికి ఆరుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విదేశాల్లో చదువులంటే...! చేతిలో ఉన్న సొమ్ముతోనో లేదా ఆస్తులు విక్రయించో చదివే వాళ్లుంటారు! మరి కొందరైతే బ్యాంకులిచ్చే రుణంతో విమానం ఎక్కేస్తుంటారు.!

 అలా కాకుండా విదేశీ యూనివర్సిటీలు, ప్రైవేటు సంస్థలు, ఫౌండేషన్లు, ట్రస్ట్‌లు అందించే స్కాలర్‌షిప్స్‌తో విద్యనభ్యసించే వాళ్ల మాటేంటి? నిజానికి అలాంటి వాళ్లు తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే ఏ దేశంలో... ఏ వర్సిటీ ఎలాంటి ఉపకారవేతనాలందిస్తోంది? ఏ ఇంటర్న్‌షిప్‌లో చేరితే ఎంత ప్రయోజనం? ఇలాంటి వివరాలన్నీ తెలిసేదెలా? దానికి సమాధానమే ‘ఠ్ఛీ ఝ్చజ్ఛు టఛిజిౌ్చటట.ఛిౌఝ’ తమకెదురైన అనుభవాన్నే ఓ స్టార్టప్ కంపెనీగా మలచి... ఎందరో విద్యార్థుల విదేశీ విద్య కలను నిజం చేస్తున్నారు సంస్థ వ్యవస్థాపకులు దామిని మహాజన్, అర్జున్ ఆర్ కృష్ణ.

 

 దామినిది జమ్మూకాశ్మీర్. అర్జున్ కేరళవాసి. కానీ, ఇద్దరికీ పరిచయమైంది మాత్రం ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్ వర్సిటీలో. బయో టెక్నాలజీలో ఎంఎస్ చేయడానికి యూకే వెళ్లారు వీళ్లిద్దరూ. అది కూడా స్కాలర్‌షిప్‌ను అందుకుని మరీ. యార్క్‌షైర్‌లోని షెఫీల్డ్ వర్సిటీ స్కాలర్‌షిప్‌కు దామిని, క్వీన్స్ స్కాలర్‌షిప్‌కు అర్జున్ ఎంపికయ్యారు. దీనిపై వాళ్లిద్దరూ ఏమంటారంటే...

 

 ‘‘అక్కడికి వెళ్లాకే మాకు యూనివర్సిటీలోని ఇతర విద్యార్థుల నుంచి ఎదురైన మొట్టమొదటి ప్రశ్నేంటో తెలుసా? తామంతా ఇంట్లో వాళ్ల సొంత డబ్బులతో అక్కడికి వచ్చామని చెబుతూ... మాకు ఈ స్కాలర్‌షిప్ ఎలా అందిందని అడిగారు. అప్పుడే మాకు అర్థమైంది భారతీయులకే కాదు..! విదేశీయులకూ స్కాలర్‌షిప్‌ల గురించి అంతగా అవగాహన లేదని! అందుకే ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ‘స్కాలర్‌షిప్’ పేరుతో ఫేస్‌బుక్ ఆన్‌లైన్ బృందాన్ని ప్రారంభించాం. ఇందులో ఉపకార వేతనం కోసం వర్సిటీలకు ఎలా ఎలా దరఖాస్తు చేసుకోవాలనే ప్రాథమిక వివరాలను పొందుపరిచేవాళ్లం. ఆశ్చర్యకరంగా మన దేశ విద్యార్థులే కాదు పాకిస్తాన్, ఈజిప్టు, పోర్చుగల్, యూరప్ దేశాల విద్యార్థులూ సభ్యులుగా చేరారు. వాళ్ల ప్రశ్నలకు అదే పేజీ వేదికగా తీరిగ్గా సమాధానమిచ్చే వాళ్లం.

 

 చూస్తుండగానే చదువు పూర్తయింది. బయటికెళితే మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి. కానీ, మా పేజీ సహాయంతో స్కాలర్‌షిప్ పొందిన చాలా మంది విద్యార్థుల నుంచి ఒకటే కోరిక.. ‘‘స్కాలర్‌షిప్ ఫేస్‌బుక్ పేజీని కాస్త వెబ్‌సైట్‌గా మార్చేసి ఆన్‌లైన్ వేదికగా ఎడ్యుకేషన్ కన్సెల్టింగ్ సేవలందించమని’’. ఇంకేముందు ఏడాది సమయంలో టెక్నాలజీని అభివృద్ధి చేసి, వర్సిటీ సమాచారాన్ని సేకరించి, ఏడాది సమయం తర్వాత ఏప్రిల్ 29న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ చేతుల మీదుగా ‘వీ మేక్ స్కాలర్స్’ పేరుతో సంస్థను పారంభించాం.

 

 అవగాహన లేకపోవడమే..

 సాధారణంగా ఉపకారవేతనాలను నాలుగు రకాలుగా పొందొచ్చు. 1. విశ్వవిద్యాలయాలు 2. విద్యా మంత్రిత్వ శాఖలు 3. ట్రస్ట్‌లు లేదా ఫౌండేషన్‌లు 4. కార్పొరేట్ సంస్థలు. అసలు ఆయా సంస్థలు ఉపకారవేతనాలను ఎందుకిస్తాయంటే.. తమ కాలేజీలను ప్రమోట్ చేసుకోవడానికి. లేదా చిన్న దేశాలైతే తమ గుర్తింపు కోసం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకే మొదటి అవకాశం. అయితే సాధారణంగా ఎంపిక ప్రక్రియ ఏడాది పాటు కొనసాగే అవకాశముంటుంది.

 

 మూడు, నాలుగు రౌండ్ల పాటు ఇంటర్వ్యూలు, మెరిట్, ఫైనాన్షియల్ లీడ్, కుటుంబ నేపథ్యం.. వంటి వివరాలు తీసుకుంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే స్కాలర్‌షిప్ కోసం ఆయా దేశాలకు వెళ్లాలనో.. లేదా డిగ్రీ పూర్తయ్యాకే దరఖాస్తు చేసుకోవాలనో అనుకుంటారు. దీంతో ఆయా స్కాలర్‌షిప్ ప్రయోజనాన్ని వృథా చేసుకుంటున్నారు. కానీ, డిగ్రీ, లేదా ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతూనే రిజిస్టర్ చేసుకొని.. వివరాలు పంపిస్తే చదువు పూర్తయ్యేలోపు స్కాలర్‌షిప్‌లను పొందొచ్చు.

 

 స్కాలర్‌షిప్, ఇంటర్న్‌షిప్‌లు కూడా..

 విదేశాల్లో చదువు కోసం ఏటా మన విద్యార్థులు రూ.200 కోట్లు ఖర్చు చేస్తుంటే.. ఇందులో స్కాలర్‌షిప్‌ల వాటా 2-4 శాతం మాత్రమే. ఇందుకు కారణం విదేశీ స్కాలర్‌షిప్‌ల గురించి సరైన అవగాహన లేకపోవడమే. ఇదే మా బిజినెస్ మోడల్. మా సైట్‌లో కేవలం స్కాలర్‌షిప్‌లే కాదు ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించిన సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. మా సేవలు పూర్తిగా ఉచితం. ఏ దేశంలో చదవాలనుకుంటున్నారు? ఏం చదవాలనుకుంటున్నారు? వంటి వివరాలు ఇందులో నమోదు చేస్తే చాలు. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఏ రంగమైనా సరే ఉపకారవేతనాల వివరాలు మీ ముందుంటాయి. సమగ్ర వివరాలతో దరఖాస్తును నింపి పంపించడమే తరువాయి.

 

 ఇప్పటివరకు 249 దేశాల నుంచి సుమారు 8 లక్షల మంది విద్యార్థులు మా సైట్‌లో రిజిస్టర్ అయ్యారు. ఇందులో నుంచి సుమారు 14 వేల మంది ఉపకారవేతనాల కోసం వివిధ వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 459 మంది విద్యార్థులకు రూ.20 కోట్లు ఉపకారవేతనాలుగా అందాయి.

 

 సమీకరణకూ సిద్ధం..

 ఇటీవలే మా సంస్థలో బిట్స్‌పిలానీ, భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు సంయుక్తంగా రూ.50 లక్షలలోపు పెట్టుబడులు పెడతామన్నారు. అగ్రిమెంట్ దశలో ఉన్నాం. ఈ నిధుల సాయంతో ‘డాష్‌బోర్డ్’ సేవలను ప్రారంభిస్తాం. ఇందుకోసం ఏడాదికి 1,000 డాలర్లు చార్జీ చేస్తాం. యూకేకు చెందిన క్యూఅండ్‌ఎస్ సంస్థతో మా మొదటి సేవల్ని ప్రారంభిస్తున్నాం. డాష్‌బోర్డ్ అంటే.. సంబంధిత సంస్థకు సంబంధించిన స్కాలర్‌షిప్ విభాగాన్ని మేం నిర్వహిస్తాం.

 

  ఇందులో విద్యార్థుల దరఖాస్తుల నుంచి మొదలుపెడితే.. ఎక్కడి నుంచి అప్లయ్ చేసుకుంటున్నారు? ఎంత మంది చేస్తున్నారు? ఆయా అర్హతలను బట్టి ఎవరికి ఎంత చెల్లించాలి వంటి సమస్త సమాచారాన్ని విశ్లేషిస్తాం. త్వరలోనే దేశంలోని అన్ని విశ్వ విద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి ఉపకారవేతనాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని విద్యార్థులకు చేరవేస్తాం. హైదరాబాద్‌లోని బీవీఐఆర్‌టీ సంస్థ నుంచి మొదలు పెడుతున్నాం’’.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే

 startups@sakshi.com కు మెయిల్ చేయండి...

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top